మంథనిలో నిర్వహించిన దశాదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘం నాయకులు
పెద్దపల్లి జిల్లా పద్మశాలి ఉద్యోగ సంఘం ప్రచార కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ సీనియర్ సహాయకులు పెండం సత్యనారాయణ మాతృమూర్తి శ్రీమతి లస్మక్క పెద్దకర్మ (దశాదిన కర్మ) కార్యక్రమం గురువారం మంథనిలోని పద్మశాలి వీధిలో గల వారి స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం పెద్దపల్లి జిల్లా బృందం పక్షాన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, లస్మక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజానికి, సంఘానికి సత్యనారాయణ అందిస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ, అటువంటి క్రమశిక్షణ గల కుమారుడిని అందించిన మాతృమూర్తి మృతి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
నివాళులర్పించిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల కోటేశం, ఉపాధ్యక్షులు బండి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే ప్రాథమిక సభ్యులు సామల శ్రీనివాస్, తాటిపాముల కృష్ణ, దుస్స సంపత్, దాసరి శ్రీనివాస్, గడ్డం సంతోష్‌లతో పాటు జయశంకర్ భూపాలపల్లి పద్మశాలి నాయకులు గాదె రమేష్ తదితరులు హాజరయ్యారు. అనంతరం పెండం సత్యనారాయణ, సోదరులు నరేందర్, శ్రీధర్ మరియు కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించి ఓదార్చారు. లస్మక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.











