సంతోష్ నగర్ వాటర్ ట్యాంక్ పరిసరాల శుభ్రత, ఇందిరానగర్లో నిర్మాణ పనుల పరిశీలన
రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి 8వ కాలనీ, 19వ డివిజన్ పరిధిలోని అల్లూరు, ఇందిరానగర్ మరియు సంతోష్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంతోష్ నగర్లోని వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాటర్ ట్యాంక్ చుట్టూ చెట్లు, పొదలు మరియు వ్యర్థాలు పేరుకుపోవడంతో, జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు. భవిష్యత్తులో ప్రజల సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే ప్రజలందరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, నల్లాలను ఉపయోగించిన అనంతరం తప్పనిసరిగా క్లోజ్ చేయాలని, నీటి వృథాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మీడియా ముఖంగా ప్రజలకు సూచించారు. అనంతరం ఇందిరానగర్లో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా, అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, 17వ డివిజన్ కార్పొరేటర్ కనుమ స్వరూప రాములు, 20వ డివిజన్ ఇంచార్జ్ రమేష్ రెడ్డి, 16వ డివిజన్ ఇంచార్జ్ గడ్డం తిరుపతి, 15వ డివిజన్ ఇంచార్జ్ బత్తిని శ్రీనివాస్, జక్కుల దామోదర్, మార్క రాజు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల అజయ్, మెరుగు రాజేశం, బోల్లం రాజు, పూజారి రాకేష్, అక్షయ్, దేవయ్య, మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

