పెద్దపల్లి, 28 September
8వ ఇంక్షైన్ కాలనీ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 18వ డివిజన్ కార్పొరేటర్, సంఘం అధ్యక్షులు దేవనపల్లి చక్రపాణి హాజరయ్యారు.
8వ ఇంక్షైన్ కాలనీ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం ఉదయం సంఘం భవనం వద్ద ఘనంగా నిర్వహించారు.
ప్రధాన కార్యదర్శి సాంబారి రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 18వ డివిజన్ కార్పొరేటర్, సంఘం అధ్యక్షులు దేవనపల్లి చక్రపాణి పాల్గొని, ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ముద్దుబిడ్డ కావడం పద్మశాలి సామాజిక వర్గం గర్వపడుతుందని, ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప మహనీయుడని, చేనేత వర్గానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గుండేటి ప్రభాకర్, వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి రాయమల్లు, పద్మశాలి మహిళా నాయకురాలు తాటిపాముల రాజ్యలక్ష్మి, మెరుగు రాజేశం, మంతు బిక్షపతి, కట్కూరి శంకర్, సంపత్, చిందం రాజేందర్, సత్యనారాయణ, రాజయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.










