స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి, అభివృద్ధి పనులపై భరోసా
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి, మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్పర్సన్ శ్రీమతి మనాలి ఠాకూర్ శుక్రవారం రామగుండం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేజ్ రామగుండం ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేజ్ రామగుండంలోని మజీద్‌ను సందర్శించి అక్కడి సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మజీద్‌లో అవసరమైన అభివృద్ధి పనుల గురించి సభ్యులు మనాలి ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మజీద్‌లో స్లాబ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వారు కోరారు. దీనిపై స్పందించిన మనాలి ఠాకూర్, మజీద్ సభ్యుల అభ్యర్థన మేరకు అవసరమైన స్లాబ్ నిర్మాణానికి కృషి చేస్తామని, ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా వాడలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీసి ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మజీద్ సభ్యులు, పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.











