కమాన్ మండలం పెంచికల్ పేటలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహణ
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కమాన్ తహసిల్దారు వాసంతి సూచించారు. కమాన్ మండలం పెంచికల్ పేట గ్రామంలో శుక్రవారం జరిగిన సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని సర్పంచ్ పల్లె మాధవి నారాయణ అధ్యక్షతన నిర్వహించగా, ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సమస్యలపై స్పందించాలని ఆమె అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకోవాలని, అవి సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, కుల దూషణలు జరుగుతున్నాయా, ఎంతమందికి చట్టంపై అవగాహన ఉందనే అంశాలను అధికారులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షురాలు ఇరుగురాల భాగ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన కల్పించారు. వారితో ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణ, ఆర్.ఐ. స్రవంతి, ఏ.ఎస్.ఐ, జిపిఓ, వార్డు సభ్యులు, కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

