పెద్దపల్లి
రైస్ మిల్లుల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
బకాయిలు చెల్లించని వారిపై చర్యలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షే మాట్లాడుతూ, బకాయిలు చెల్లించని డిఫాల్టర్ రైస్ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సంబంధిత రైస్ మిల్లుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా, సంబంధిత రైస్ మిల్లర్లు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బకాయిల వసూళ్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డి.సి. ఓ. శ్రీమాల, ఆర్డీఓ గంగయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








