గోదావరిఖని, 8 October
సింగరేణి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ పై కేంద్ర కార్యదర్శి కే రాజరత్నం వివరణ
గోదావరిఖని/పెద్దపల్లి: 7 ఎల్ఈపి మైన్ పిట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా కేంద్ర కార్యదర్శి కే రాజరత్నం, బ్రాంచ్ కార్యదర్శి జి సాంబశివరావు హాజరయ్యారు. వారు సింగరేణి ఆర్థిక పరిస్థితి, కంపెనీ భవిష్యత్తు గురించి వివరించి, నూతన పిట్ కమిటీని ఎన్నుకున్నారు. ఫిట్ సెక్రటరీగా టి.అనిల్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా పరమేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బి.చంద్రశేఖర్, ఆర్.ఆంజనేయులు, జె.వెంకటేష్లను ఎన్నుకున్నారు. అలాగే, డెలిగేట్స్గా ఎండి రఫీ, గణేష్, శంకర్, సల్మాన్, రాజ్ కిరణ్, వెంకటేష్, శ్రీకాంత్, ప్రవీణ్, రమాకాంత్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ 7 ఎల్ఈపి మైన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు.












