దేశ రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకున్నారు
గోదావరిఖని 2 టౌన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనీ, అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. గోదావరిఖని 2 టౌన్ సిఐ ఎన్. ప్రసాదరావు, పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్, పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. 8వ కాలనీ యువత, స్థానిక ప్రజలు కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా, దేశ రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. ప్రసాదరావు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుధాకర్, పోలీస్ కానిస్టేబుల్స్ జె. వెంకటేష్, సి.హెచ్. రాజయ్య, రామచంద్రం, జై వెంకటేష్, అనూష, ఎం. మల్లేశ్వరి, సి.హెచ్. రాజ్ కుమార్, ఎస్.డి అఫ్రోజ్, స్థానిక యువత మరియు ప్రజలు పాల్గొన్నారు.


