పోలీస్ అమరవీరుల దినోత్సవం
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ ప్రసాదరావు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరుడు కురుసం బాపుకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివి, వెలకట్టలేనివి అని, పోలీస్ అమరవీరుల త్యాగం వృధా కాదని పోలీస్ అమరవీరులను స్మరించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది పోలీసులు ప్రజలను కాపాడి, విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది క్యాండిల్స్ తో పోలీస్ అమరవీరుడు కురుసం బాపు సమాధి వద్ద నివాళులు అర్పించి, పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ ప్రసాదరావు, పోలీస్ స్టేషన్ సిబ్బంది సుధాకర్ ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ సిహెచ్ రాజయ్య, జె వెంకటేష్, ఎన్ విశ్వనాథ్, సిహెచ్ రామచంద్రం, ఎస్ డి అఫ్రోజ్, మల్లేశ్వరి, శ్రీలత, అంజలి, హోంగార్డ్స్ శ్రీధర్, మల్లేష్ మరియు విజయమని పాల్గొన్నారు.












