గోదావరిఖని, 8 October
ఏఐటీయూసీ డిమాండ్
సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో, కాంట్రాక్ట్ కార్మికులకు కంపెనీ లాభాలలో 10 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ-2 జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, జీఎంకు మెమోరాండం అందజేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు శాశ్వత కార్మికులతో కలిసి పనిచేస్తూ, కంపెనీ లాభాలలో భాగస్వాములవుతున్నందున, వారికి లాభాలలో 10 శాతం వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు, సహాయ కార్యదర్శి శాంసన్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


