గోదావరిఖని, 7 November
అన్ని రంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కార్మికులకు అభినందనలు
జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఇచ్చే స్టార్ రేటింగ్ అవార్డులలో, సింగరేణి సంస్థలోని ఆర్జీ-3 ఏరియా ఓపెన్ కాస్ట్ మైన్ నం.1 వరుసగా మూడోసారి ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి రికార్డు సృష్టించడం అభినందనీయం. బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయిస్తారు. కేంద్ర బొగ్గు శాఖ పరిశీలక బృందం ప్రత్యక్షంగా పరిశీలించి మూల్యాంకనం చేస్తుంది. 100 మార్కులకు 91కి పైగా మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఈ నెల 2వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో, ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా, కోల్ ఇండియా మరియు సింగరేణి సంస్థ ఛైర్మన్ సమక్షంలో అందుకున్నారు.
ఇది మనకు గర్వకారణం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సింగరేణి సంస్థలోని అత్యుత్తమ ఓపెన్ కాస్ట్ గనిగా, అన్ని రంగాల్లో ముందుండటం ఉద్యోగుల కృషి, నైపుణ్యానికి నిదర్శనం. అవార్డు అందుకున్న షీల్డ్, ప్రశంసా పత్రాలను శనివారం ఉదయం గని ఆపరేషన్ సైట్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శించి, కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, గని ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ వి.ఫాటింగ్, గని మేనేజర్ రావుల పాపయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఎం.ఆర్.సి.రెడ్డి, అధికారుల సంఘ ప్రతినిధి, సెక్యూరిటీ అధికారి కోల శ్రీనివాస్ గౌడ్, ఏరియా అధికారులు మురళీకృష్ణ, గని ప్రాజెక్ట్ ఇంజనీర్ జ్ఞాన సంబంధన్, రక్షణ అధికారి అజయ్ కుమార్, సర్వే అధికారి రవీందర్ లతో పాటు గని అధికారులు, సూపర్ వైజర్లు, కార్మికులు పాల్గొని సంబరాలలో మునిగి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఓసీ-1 రికార్డులను కాపాడుకుంటూ, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న గని చిన్న గనిగా ఉన్నప్పటికీ, ప్రణాళికలో భాగంగా ఓబీ, కోల్ ఉత్పత్తిని భద్రతతో కూడిన ఉత్పాదకతతో సాధించాలని, ఇదే సంతోషాన్ని కొనసాగేలా అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.











