పోలీస్ కమిషనరేట్
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హెడ్‌క్వార్టర్స్, ఆర్ఐ కార్యాలయం, డాగ్ స్క్వాడ్ గదులను ఆయన పరిశీలించారు. హెడ్‌క్వార్టర్స్‌లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
భద్రతా చర్యలపై సీపీ సూచనలు
సీపీ కార్యాలయ భవన ప్రాంగణంలో విధులు నిర్వహించే ఆర్మ్డ్ గార్డులు, గేట్ డ్యూటీలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తూ భద్రతను పటిష్టంగా పర్యవేక్షించాలని సూచించారు.
హెడ్‌క్వార్టర్స్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని, కార్యాలయ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.







