పోతన కాలనీ, అల్లూరు, 8 ఇంక్లైన్ కాలనీల్లో కిరాణా, పాన్ షాపుల్లో తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీఐజీల ఆదేశాల మేరకు గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతన కాలనీ, అల్లూరు, మరియు 8 ఇంక్లైన్ కాలనీలలోని కూడళ్లలో గల కిరాణా షాపులు, హోటల్స్, పాన్ షాపులలో గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర మాదకద్రవ్యాలు (డ్రగ్స్) కొరకు నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మిన, కొన్న, నిల్వ చేసిన షాపు యజమానులపై నార్కోటిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తారు. యువత ఎక్కువగా గంజాయి, ఇతర డ్రగ్స్ కు బానిసై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్. లక్ష్మణ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గోదావరిఖని-2 టౌన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్. లక్ష్మణ్ (సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గోదావరిఖని-2 టౌన్), సిబ్బంది జె. వెంకటేష్, సిహెచ్ రాజయ్య, సిహెచ్ రాజ్ కుమార్, కిరణ్ మరియు డాగ్ హ్యాండ్లర్లు పాల్గొన్నారు.












