నేర వార్తలు
పెద్దపల్లిలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి, కొలనూరుకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 83 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
పోలీసుల హెచ్చరిక
గంజాయి విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

