పల్లకి, ఉయ్యాల సేవల్లో భక్తులు, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి పాల్గొన్న వైనం
8వ కాలనీ, హనుమాన్ నగర్ లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ దుర్గా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా, 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ, ఉయ్యాల సేవలను ఆలయ అర్చకులు సుమంత్ కుమారా చార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలలో ఆలయ గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, ఆలయ ఉపాధ్యక్షులు బంగారి శివ, ఆలయ ఉపాధ్యక్షుడు మార్క రాజు, నరేష్, వెంకటేష్, మల్లేష్, క్రాంతి, రాఘవేంద్ర, అనిల్, రజినీకాంత్, నవీన్, శ్రీధర్, ఇప్పలపల్లి స్రవంతి, బంగారి సరిత, గీత, అరుణ, లక్ష్మీ, వందన, శంకరమ్మతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












