గోదావరిఖని, 16 October
భక్తి వార్తలు
దేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడికే లెవెన్ ఇంక్లైన్ గనిలో సరస్వతి మాత రూపంలో ఉన్న అమ్మవారిని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు దర్శించుకున్నారు. వారికి గని మేనేజర్ మథుస్ జాన్సన్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధి కోసం అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ, గనిలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచ్ సెక్రటరీ రంగు శీను, జీఎం కమిటీ మెంబర్ సిద్ధమల్ల రాజు, ఫిట్ సెక్రటరీ నాయిని శంకర్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గొడిశల నరేష్, చెప్పాల భాస్కర్, కండే కీర్తి శేఖర్, గోష్కల శ్రీనివాస్, గడ్డం బాలు, తాళ్లపల్లి శ్రీనివాస్, దుర్గం తిరుపతి, ఆకుల సురేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.












