పెద్దపల్లి, 28 September
కమాన్ పూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరాహ స్వామి వారిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఈవో రమాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈవో రమాదేవికి ఆదివరాహస్వామి దేవస్థాన చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతరెడ్డి, అర్చకులు వరప్రసాదచార్యులు కలిసి ఆశీర్వచనం, ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.