సమాజ సేవ
శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా, మండలం, కల్వచర్ల గ్రామపంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మిక దంపతులు మంథని నర్సమ్మ-ఓదెలులను సోమవారం ఘనంగా సత్కరించారు. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, తెలంగాణ మహిళా విభాగం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జీహెచ్ఎంసీ/గ్రామపంచాయతీ కార్మికుల సత్కార కార్యక్రమంలో భాగంగా కల్వచర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కల్వచర్ల శ్రీ సత్య సాయి భజన మండలి కన్వీనర్ నూక రమేష్, మహిళా సేవాదళ్ సమన్వయకర్త శ్రీమతి నూక వాణి తమ సాయి నిలయం గృహానికి పారిశుద్ధ్య కార్మిక దంపతులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి పూలు, తాంబూలం, మిఠాయిలతో పాటు నూతన వస్త్రాలను అందజేసి సన్మానించారు.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు అవతరించి 100 సంవత్సరాలు (శత జయంతి) పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, సమాజానికి నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సత్కార కార్యక్రమంలో కల్వచర్ల శ్రీ సత్య సాయి భజన మండలి సభ్యులు గుండ శంకరయ్య, శ్రీమతి జయప్రద, గరిగంటి రాజం, కొలిపాక సారయ్య, కొండ సమ్మయ్యలతో పాటు సత్య సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.











