నవరాత్రుల సందర్భంగా కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
8వ కాలనీ హనుమాన్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోమాత పూజ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు సుమంత్ కుమారా చార్యులు, ఆలయ అధ్యక్షుడు, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, ఆలయ ఉపాధ్యక్షులు బంగారి శివ, ఆలయ ఉపాధ్యక్షుడు మార్క రాజు, నరేష్, వెంకటేష్, మల్లేష్, క్రాంతి, రాఘవేంద్ర, అనిల్, రజినీకాంత్, నవీన్, శ్రీధర్, స్రవంతి, అరుణతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












