పోలీసు యంత్రాంగం
గోదావరిఖని/పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని ఎంటీవో (మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎంటీవో కార్యాలయ పరిసరాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. కార్యాలయ ఆవరణ, పోలీసు వాహనాల పార్కింగ్ ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ వాహనాల నిర్వహణ, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
కార్యాలయ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, పరిశుభ్రమైన మరియు క్రమబద్ధమైన వాతావరణం పోలీసు సేవల నాణ్యత, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.











