సింగరేణి కార్మిక సంఘం
గోదావరిఖని/పెద్దపల్లి: ఆర్జీ-2 ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, ఓసీపీ-3 పిట్ కార్యదర్శులను, టీబీజీకేఎస్ నాయకులను ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్ హరిజన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల పేర్లను, పదవులను ఒక్కొక్కరిగా పీఓకు పరిచయం చేశారు. శ్రీనివాస్, పీఓ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎల్లప్పుడూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటుందని, సింగరేణి సంస్థ అభివృద్ధికి, మనుగడకు తోడ్పడుతుందని అన్నారు. సింగరేణిలో ఏ సమస్య ఎదురైనా కార్మికుల పక్షాన నిలబడి పోరాడే సంఘం టీబీజీకేఎస్ అని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు అనేక హక్కులు సాధించడంతోపాటు, బొగ్గు ఉత్పత్తి, లాభాల్లో సింగరేణి సంస్థ అగ్రస్థానంలో నిలవడానికి తమ వంతు కృషి చేశామని గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కార్మికుల గొంతుకగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. టీబీజీకేఎస్ ఎప్పుడూ ప్రాజెక్ట్ స్థాయిలో నెలకొనే కార్మికుల నిజమైన సమస్యలను మాత్రమే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని, ఉత్పత్తి ఉత్పాదకతలో యాజమాన్యానికి సహకరించడంతో పాటు సేఫ్టీ, సంక్షేమం కొరకై ఎల్లవేళలా కార్మికుల వెంట నడుస్తుందని అన్నారు. సమస్యల పరిష్కారం కొరకై యాజమాన్యం తమ నాయకత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు ఐ.సత్యం, కూర తిరుపతి, బొడ్డు రమేష్, మార్క్ నరేష్, బేతి రవితేజ, బ్రాంచ్ సెక్రటరీ ముసుకుల అనిల్ రెడ్డి, హరి ప్రసాద్, ఓసిపి-3 ప్రాజెక్ట్ సెక్రటరీ మామిడి తిరుపతి, పిట్ కార్యదర్శులు వెంకటేష్, దాసరి శ్రీనివాస్, బండి చంద్రశేఖర్, కరుణాకర్, రామ్, చరణ్, ఓసిపి-3 నూతన కమిటీ సభ్యులు పల్లె రాజేశం, మహిపతి, వేణుగోపాల్, రామచందర్, వంశీ, సతీష్, శ్రీనివాస్, కుమార్, వేణుగోపాల్, మునేందర్, లక్ష్మీనారాయణ, సాగర్, రమేష్, ముక్కెరమహేందర్, కమలాకర్, కుమార్, వెంకటేష్, రాజశేఖర్, అశోక్, పోశం, రమేష్, సంజీవరెడ్డి, మూర్తి, పారేపల్లి, నరేందర్, రవి, రాజేశం, రవికుమార్, సతీష్, దేవేందర్ రెడ్డి, రమేష్, రంజిత్ రెడ్డి, లక్ష్మణమూర్తి, శంకర్, నాగార్జున, కిరణ్, సురేష్, సత్యనారాయణ, పూర్ణచందర్, కనకరాజు, సాహిత్, జీవన్, లింగారెడ్డి, గుజ్జుల రాజేందర్, అంబి రాకేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












