నేర వార్తలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా, ఈ రోజు తెల్లవారుజామున నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్ఐ దీకొండ రమేష్, సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,850 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారి వివరాలు
మహమ్మద్ తాజుద్దీన్, లక్ష్మీనగర్, గోదావరిఖని; బండారి సందీప్ సుధాకర్, సప్తగిరి కాలనీ, గోదావరిఖని; లింగంపల్లి శివ, సప్తగిరి కాలనీ, గోదావరిఖని; నెరెల్ల రాజు, సప్తగిరి కాలనీ, గోదావరిఖని; కీర్తి హరీష్, సప్తగిరి కాలనీ, గోదావరిఖని.
అదుపులోకి తీసుకున్న ఐదుగురు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియు సెల్ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.












