స్వర్గీయ బత్తిని లక్ష్మి లింగయ్య గౌడ్ జ్ఞాపకార్థం దాతల వితరణ
మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ వెంకట్రావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వర్గీయ బత్తిని లక్ష్మి లింగయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు బత్తిని శ్రీనివాస్, మనవడు వరుణ్ స్టీల్ గ్లాసులను వితరణ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని వారు చేసిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం దాతలు ముందుకు రావడం సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున దాతలు బత్తిని శ్రీనివాస్ కి, వరుణ్ లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి మరింత తోడ్పడతాయని పాఠశాల బృందం ఆకాంక్షించింది.












