సమస్యలుంటే సంప్రదిస్తే ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తామని హామీ
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆదేశాల మేరకు, పెద్దపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ స్ఫూర్తి మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం, సుల్తానాబాద్‌లోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏ రకమైన సమస్యలు ఎదురైనా, సహాయం కొరకు తక్షణమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గానీ, మండల న్యాయ సేవా అధికార సంస్థలను గానీ సంప్రదించినట్లయితే, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.












