విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన గ్రామ సర్పంచ్ పల్లె మాధవి
పెద్దపల్లి జిల్లా, మండలం పెంచికల్ పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పల్లె మాధవి పాఠశాల విద్యార్థినులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ప్రకృతిని పూజించే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆనందాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని భావితరాలకు వాటిని అందించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.












