30 ఏళ్లుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన పాపయ్య సేవలు మరువలేనివి
మండలం కన్నాల గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన నగునూరి పాపయ్య, 30 ఏళ్లపాటు అదే పాఠశాలలో సేవలందించి, గ్రామంలోని ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. వారి ఆకస్మిక మరణం పట్ల కన్నాల పూర్వ విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాదులోని వారి స్వగృహంలో జరిగిన ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాపయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, చిదురాల సురేందర్ రెడ్డి, గాదె సంజీవ్ రెడ్డి, ముసుకుల రమేష్ రెడ్డి, రమణారెడ్డి, బెల్లంకొండ భూమారెడ్డి, సదానందం గౌడ్, రాములు వెంకట్ రెడ్డి, సందీప్ అన్నం, రమేష్ పాల్గొన్నారు.












