ప్రభుత్వ పథకాలు
గోదావరిఖని/పెద్దపల్లి (అక్షరజ్యోతి ప్రతినిధి): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం శాసనసభ్యులు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, రామగుండం 8వ కాలనీ 19వ డివిజన్ పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన ఆరెల్లి మధునమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల-రాజిరెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా మధునమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తమలాంటి పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎంతో సహాయం చేస్తోందని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మార్క రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజారి రాకేష్, 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ మేకల అజయ్ తదితరులు పాల్గొన్నారు.












