రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికులకు సద్దుల బతుకమ్మ, విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా డిశుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేశారు. ఆర్జి-2 ఏరియాలోని ఓసిపి-3లోనీ రిలే ఏ లో ఈ కార్యక్రమం జరిగింది.
రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికులకు సద్దుల బతుకమ్మ, విజయదశమి, దీపావళి డిశుభాకాంక్షలు తెలియజేస్తూ కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేశారు. ఈ మేరకు ఆర్జి-2 ఏరియాలోని ఓసిపి-3లోనీ రిలే ఏ లో ఐఎన్టియుసి ప్రాజెక్టు సెక్రటరీ కొంగర రవీందర్ అధ్యక్షతన, బ్రాంచ్ సెక్రటరీ ఆకుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శుభాకాంక్షల సందేశ కరపత్రాలను పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి బ్రాంచ్ సెక్రటరీ వాసాల అశోక్, మారుపాక శంకర్, శేషు కుమార్, గౌస్, సోగాల రవీందర్, ఆవుల లక్ష్మణ్, కోల కనకయ్య, శనిగారపు నాగేశ్వరరావు, గజ్జి ఓదెలు, సల్ల శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, వెంకట్రామిరెడ్డి, కమలాకర్ తో పాటు మరికొంతమంది ఐఎన్టియుసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







