విచ్చేసిన (అక్షర జ్యోతి) అక్టోబర్ 02
రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాలమేరకు, 8వ కాలనీలో పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత ఆశయాలను స్మరించుకున్నారు.
రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం 8వ కాలనీలో పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజి రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం. ఇదే రోజున భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా జరుపుకుంటాం. మహాత్మా గాంధీ సత్యం,అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గొప్ప పాత్ర పోషించారు. ఆయన జీవితం మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. సత్యమే దేవుడు, అహింసే అత్యంత గొప్ప శక్తి అనే గాంధీజీ ఆలోచనలు నేటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మారెల్లి రాజిరెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము రాములు, మాజీ కొండగట్టు డైరెక్టర్ జక్కుల దామోదర్, 15 డివిజన్ ఇంచార్జ్ బత్తిని శ్రీనివాస్, ఆర్జి 2 వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు మెరుగు రాజేష్, డివిజన్ అధ్యక్షులు మార్కరాజు, ఇరికి మహేష్, 8వ కాలనీ పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల అజయ్, అవినాష్, పూజారి రాకేష్, బొల్లం రాజు, కొమ్ము ఓదేలు, తాటిపల్లి దేవయ్య, రాజు, సిరికొండ అక్షయ్, రవితేజ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.












