గడ్డం వెంకట స్వామి (కాక) జయంతి వేడుకలలో కలెక్టర్
మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గడ్డం వెంకట స్వామి (కాక) జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
గడ్డం వెంకట స్వామి సేవలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు గడ్డం వెంకట స్వామి (కాక) కేంద్ర మంత్రిగా, వివిధ పదవులు చేపట్టి, ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు.
జి.వెంకట స్వామి అందించిన స్ఫూర్తితో మనందరం పని చేయాలని, విధులు నిర్వహించే సమయంలో అట్టడుగు వర్గాల వారికి మన వంతు సహకారం అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. మన ప్రాంతంలోని పేదలకు వెంకటస్వామి అనేక సేవలు అందించారని, ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి, పేదల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి పని చేశారని, తెలంగాణ సమాజం పడే బాధలను అర్థం చేసుకుని, ప్రజల కష్టాల నివారణకు కృషి చేశారని తెలిపారు. కోల్ బెల్ట్ ఏరియాలో కార్మికుల గుండెల్లో చిరస్థాయి స్థానం పొందారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాష్, సిపిఓ రవీందర్, ఇంటర్మీడియట్ అధికారిణి కల్పన, యువజన, క్రీడా శాఖ అధికారి సురేష్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు ారు.
గడ్డం వెంకట స్వామి (కాక) ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అధికారులను కోరారు.












