ఆరోగ్యకరమైన సమాజానికి తల్లుల ఆరోగ్యం కీలకం: కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్
గోదావరిఖనిలోని 39వ డివిజన్ శివాజీ నగర్ 1లోని అంగన్వాడి కేంద్రం(72)లో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మరియు శిశు సంరక్షణపై ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్డ ఆరోగ్యకరమైన సమాజం అనేదే తమ లక్ష్యమని తెలిపారు. మన డివిజన్లో తల్లులందరూ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె పేర్కొన్నారు.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబం బాధ్యత అని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరస్వతి, స్వరూప, ఆర్ పి సుజాత, డివిజన్ ప్రజలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.












