ఆరోగ్యం
పెంచికల్ పేట్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం ప్రాధాన్యతపై గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లె మాధవి-నారాయణ, అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ, ఏఎన్ఎం మేటిల్డ, అంగన్వాడీ టీచర్లు కౌసల్య, ఈశ్వరి, ఆశా వర్కర్లు కల్యాణి, సుమలతతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని వివరించారు.

