గోదావరిఖని, 6 October
ఐఎన్టియుసి
తెలంగాణ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మరియు ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు, ఆర్జి-2 వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఆర్జి-2 ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్ల పిట్ సెక్రెటరీల సమావేశం నిర్వహించారు. గోదావరిఖని, పెద్దపల్లి నుంచి ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐఎన్టియుసి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహ రెడ్డి, మరో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి హాజరై, యూనియన్ బలోపేతం, కార్మికుల సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు, ప్రతి మైన్ మరియు డిపార్ట్మెంట్లో యూనియన్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు అండగా నిలుస్తూ, వారి హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ జనరల్ సెక్రెటరీ నాచగోని దశరథం గౌడ్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అయి రెడ్డి సంపత్ రెడ్డి, నాయకులు వసంశెట్టి మార్కండేయ, బ్రాంచ్ సెక్రెటరీలు ఆకుల రాజయ్య, చిలుముల అవినాష్, తోకల సమ్మయ్య, ప్రణయ్, ఓసిపి-3 ప్రాజెక్ట్ సెక్రెటరీ కొంగర రవీందర్, పిట్ సెక్రెటరీలు వంగ సురేష్, తోడే తిరుపతి, దిలీప్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీలు బంగారి శ్రీనివాస్, రాక శ్రీనివాస్, ఆది కోటేశ్వరరావు, నాయకులు గుడాల అంజయ్య, గజ్జి ఓదెలు, సాయి, చల్ల అశోక్ రెడ్డి, అబ్బిడి రాజిరెడ్డి, ఐలయ్య, కల్లూరి రాజయ్య, వేముల సత్యనారాయణ, రాకేష్, సుమిత్, సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.












