సారాంశం
ముత్తారంలో జరిగిన ద్వాదశ దిన కార్యక్రమంలో పాల్గొన్న సంఘ నాయకులు, ఉద్యోగులు
ముఖ్య విషయాలు
- 1ఈ కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బొద్దుల గంగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సింగరేణి ఆర్జీ-1 ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ దుబాసి విష్ణుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు బండి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి అనుమండ్ల రాజశేఖర్, సంఘ ప్రాథమిక సభ్యులు, సీనియర్ అసిస్టెంట్ చింతకింది శ్రీనివాస్ తో పాటు అధిక సంఖ్యలో హాజరై స్వర్గీయ రాజలింగు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు.
- 2అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశం, వారి సోదరులు, కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- 3రాజలింగు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
- 4జిల్లా కార్యదర్శి కోటేశం తండ్రి రాజలింగు చిత్రపటానికి నివాళి
ముత్తారంలో జరిగిన ద్వాదశ దిన కార్యక్రమంలో పాల్గొన్న సంఘ నాయకులు, ఉద్యోగులు
ముత్తారం/పెద్దపల్లి: తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం ( ) పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, ముత్తారం ఎంపీడీఓ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ పరికిపండ్ల కోటేశం తండ్రి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పరికిపండ్ల రాజలింగు ద్వాదశ దిన కార్యక్రమం బుధవారం వారి స్వగ్రామమైన ముత్తారం (మంథని)లో జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బొద్దుల గంగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సింగరేణి ఆర్జీ-1 ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ దుబాసి విష్ణుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు బండి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి అనుమండ్ల రాజశేఖర్, సంఘ ప్రాథమిక సభ్యులు, సీనియర్ అసిస్టెంట్ చింతకింది శ్రీనివాస్ తో పాటు అధిక సంఖ్యలో హాజరై స్వర్గీయ రాజలింగు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు.
అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశం, వారి సోదరులు, కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజలింగు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.