సార్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడాన్ని నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు
ఓటు హక్కు పరిరక్షణ కోసం, సార్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో ఇండియా కూటమి లోని భాగస్వాములైన పార్టీలతో కలిసి బుధవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓట్ల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, జవాబుదారీతనం ఉండాలని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం, అన్యాయం లేదా అర్హులైన ఓటర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిందేనని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, 8వ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, కార్పొరేటర్లు 17వ డివిజన్ అనుము స్వరూప రాములు, 14వ డివిజన్ శంకర్ నాయక్, 18వ డివిజన్ దేవనపల్లి చక్రపాణి, 15వ డివిజన్ ఇంచార్జ్ బత్తిని శ్రీనివాస్, 16వ డివిజన్ ఇంచార్జ్ గడ్డం తిరుపతి, 20వ డివిజన్ ఇంచార్జ్ బండ రమేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మర్కా రాజు, బండారి సునీత, 8వ కాలనీ పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల అజయ్, బీసీ సెల్ మెరుగు రాజేష్, ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు పరకాల ప్రశాంత్, కొమ్ము ఓదేలు, పూజారి రాకేష్, బొల్లం రాజు, మోత్కు అవినాష్, సునీల్, కుమార్, ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన సిపిఐ, సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ, మరియు గంగ పుత్ర, ముదిరాజ్, యాదవ్, విశ్వ బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, మాల, మాదిగ, మైనారిటీ, గౌడ, మిగతా కుల సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










