సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆధ్వర్యంలో నిర్వహణ
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా, ఆయన 25 సంవత్సరాల ప్రజాపాలనను స్మరించుకుంటూ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో లంబాడి తండాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో 8వ కాలనీ మండల అధ్యక్షుడు ఆకుల శశి కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ఆకుల కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు లింగం నాయక్ మరియు బిజెవైయం మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, నాయకులు భూక్య సమ్మయ్య నాయక్, ఇస్లావత్ సతీష్, నగావత్ రాజ్ కుమార్, శ్రీనివాస్ నాయక్, సాయి కుమార్, మునావత్ అరుణ్ నాయక్, మాలోత్ కుమార్ నాయక్, నగావత్ రాకేష్ నాయక్ లు పాల్గొన్నారు.












