ప్రతి ఇంటికి మొక్కలు అందించి, వాటి సంరక్షణ బాధ్యతను గుర్తు చేసిన నాయకులు
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం, నగర మేయర్ మహంకాళి స్వామి సూచనల మేరకు 19వ డివిజన్ అల్లూరులో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల-రాజిరెడ్డి మాట్లాడుతూ, మొక్కలు పంపిణీ చేయడం మాత్రమే మన బాధ్యత కాదని, ప్రతి ఇంట్లో ఈ మొక్కను నాటడంతో పాటు, దానికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ, సంరక్షిస్తూ, అది పెద్దదై పండ్లు ఇచ్చే వరకు బాధ్యతగా చూసుకోవాలని అన్నారు. ఈరోజు మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి ప్రాణవాయువును అందించే అమూల్యమైన సంపద అని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మనం నాటే ప్రతి మొక్క మన పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా అని పిలుపునిచ్చారు.
ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత అని, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప రాములు, మాజీ కొండగట్టు దేవస్థాన డైరెక్టర్ జక్కుల దామోదర్, 20 డివిజన్ ఇంచార్జ్ బండ రమేష్ రెడ్డి, బీసీ సెల్ మెరుగు రాజేష్, డివిజన్ అధ్యక్షులు మార్కరాజు, సాధుల శ్రీనివాస్, పూజారి రాకేష్, దేవయ్య, తోటి శ్రీనివాస్, రాజు, డివిజన్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












