క్రీడలు
గత తేదీ 04/10/2026న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం (జె.ఎన్.ఎస్)లో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్ ఫుట్ బాల్ పోటీలలో చందనాపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆర్.సుధీర్ కుమార్ (అండర్-17 బాలుర విభాగం), యు.అఖిలేష్ (అండర్-14 బాలుర విభాగం)లు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎ. కొమురయ్య, చందనాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఎం. లక్ష్మి, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సయ్యద్ ఖాజాబీ లు విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని సూచించారు.











