కుమారుడు, కూతురితో కలిసి పురుగుల మందు సేవించిన కొండయ్యపల్లి సర్పంచ్ వినయ్ సాగర్
కరీంనగర్ జిల్లా మండలం కొండయ్యపల్లి గ్రామ సర్పంచ్ మల్యాల వినయ్ సాగర్ తన కుమారుడు, కూతురుతో కలిసి మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధిస్తున్నారని, నా చావుకు ఎమ్మెల్యేనే కారణం అని ఆరోపించినట్లు సమాచారం. స్థానికులు వెంటనే ముగ్గురినీ కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

