బీర్పూర్/జగిత్యాల,సెప్టెంబర్03(అక్షరజ్యోతి ప్రతినిధి): మండలంలోని సుమారు వేయి సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరుకు కృషి చేయాలని కోరుతూ ఆలయ పాలకమండలి, స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే ఈ క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే దాతలు, భక్తుల సహకారంతో కోటి రూపాయల వ్యయంతో ఆలయ మండపం వెడల్పు, గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి దాదాపు రూ.5 కోట్ల నిధులు అవసరమని, ఇందులో భాగంగా ప్రాకార మండపం, యాగశాల, హనుమాన్ మందిరం, రాజగోపురం, ఆలయం చుట్టూ విస్తరణ, కోనేరు పునర్నిర్మాణం, ఘాట్ రోడ్డు వెడల్పు, జాతర ప్రాంతానికి వచ్చే రెండు రహదారుల విస్తరణతో పాటు శిథిలావస్థకు చేరిన రథశాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అత్యంత సానుకూలంగా స్పందిస్తూ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీర్నెని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఎలమట్ల హరీష్, ఉప సర్పంచ్ జితేందర్, ఆలయ కమిటీ సభ్యులు చల్ల లక్ష్మణ్ యాదవ్, చెన్న గంగాధర్, ఎనగంటి సతీష్, యశోద రమేష్, చెట్టిపల్లి సత్యనారాయణ, జైన మాజీ సర్పంచ్ కుంట సుధాకర్, ఆలయ పూజారులు పెద్ద సంతోష్, చిన్న సంతోష్, మధు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
Share:

సారాంశం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం అందజేసిన ఆలయ పాలకమండలి, ప్రజాప్రతినిధులు
ముఖ్య విషయాలు
- బీర్పూర్/జగిత్యాల,సెప్టెంబర్03(అక్షరజ్యోతి ప్రతినిధి): మండలంలోని సుమారు వేయి సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరుకు కృషి చేయాలని కోరుతూ ఆలయ పాలకమండలి, స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
- ఆలయ సమగ్ర అభివృద్ధికి దాదాపు రూ.5 కోట్ల నిధులు అవసరమని, ఇందులో భాగంగా ప్రాకార మండపం, యాగశాల, హనుమాన్ మందిరం, రాజగోపురం, ఆలయం చుట్టూ విస్తరణ, కోనేరు పునర్నిర్మాణం, ఘాట్ రోడ్డు వెడల్పు, జాతర ప్రాంతానికి వచ్చే రెండు రహదారుల విస్తరణతో పాటు శిథిలావస్థకు చేరిన రథశాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.
- ఇప్పటికే దాతలు, భక్తుల సహకారంతో కోటి రూపాయల వ్యయంతో ఆలయ మండపం వెడల్పు, గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే ఈ క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Mogulla Bhadraiah
Reporter
Telangana
4ఆర్టికల్స్
2,445వ్యూస్










